Thursday, January 23, 2025

కాంగ్రెసోళ్లకు అధికారమే ముఖ్యం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మూడు గంటల కరెంట్ ఇస్తే మూడు ఎకరాలు పారుతుందని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అంటున్నారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. హుస్నాబాద్‌లో హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలను నమ్మితే మోసపోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ నేతలకు అధికారమే ముఖ్యమని, జన సమస్యలు పట్టవని హెచ్చరించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత బిఆర్‌ఎస్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధు రాదని, ఎస్‌సి, ఎస్‌టి అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు. ఎన్నికలంటే ఐదేళ్ల భవిష్యత్ అని, ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. బిఆర్‌ఎస్‌లో పాలనలో హుస్నాబాద్ అభివృద్ధి జరిగిందని ప్రశంసించారు. సర్పంచ్‌లు, ఎంపిటిసిలకు నిధులు మంజూరు చేశామని, ఆలస్యమైనా రైతు రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News