Wednesday, December 25, 2024

ఆ వడ్డీ రైతులే కట్టాలని చెప్పడం సరికాదు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బడ్జెట్‌పై చర్చ సమాధానం ఒకే రోజులో పూర్తి కావాలనడం సరికాదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు తెలిపారు. బడ్జెట్‌పై చర్చించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శలు గుప్పించారు. బడ్జెట్ చర్చను నాలుగు రోజులకు కుదించారని, కనీసం 15 రోజులు బడ్జెట్ సమావేశాలు జరపాలని బిఎసిలో డిమాండ్ చేశామన్నారు. బిఎసి  సమావేశం అనంతరం అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులపై కక్ష గట్టిందని, రేపు నిరుద్యోగుల సమస్యలపై చర్చ పెట్టాలని ప్రతిపాధించామని, లక్షలాది నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసిందని ధ్వజమెత్తారు. నిరుద్యోగులపై అక్రమ కేసులు పెడుతున్నారని, ప్రధాని ప్రతిపక్షంగా నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

మరో ఎనిమిది సమస్యలను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చామని, శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో భయానక వాతావరణం ఏర్పడిందని, చేనేత రంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం గురించి చర్చ జరపాలని, బాండ్ పేపర్లు, ఆరు గ్యారంటీలపై చర్చించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీలో ఆంక్షలు పెట్టి రైతుల్ని ఇబ్బంది పెడతున్నారని, డిసెంబర్ 9 తరువాత ఉన్న వడ్డీ రైతులే కట్టాలని చెప్పడం సరికాదని, పంటలకు బోనస్, రైతు భరోసాపై చర్చ జరగాలని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి నిధులు ఎందుకు ఎత్తేశారని అడిగారు. స్థానిక సంస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో ప్రజారోగ్యం దెబ్బతింటోందని, ఎనిమిది నెలలుగా ఒక్క రూపాయి కూడా పీజు రీయింబర్స్ ఇవ్వలేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News