Saturday, December 21, 2024

అక్కడ మాదిగలు ఆత్మహత్య చేసుకుంటే కాంగ్రెస్ పట్టించుకోలేదు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎస్‌సి వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బిఆర్ఎస్ పార్టీ తరపున తాము హర్షం వ్యక్తం చేస్తున్నామని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తెలిపారు. సుప్రీంకోర్టు ఎస్‌సి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో శాసన సభలో హరీష్ రావు ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఎస్‌సి వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపామని చెప్పారు. ఎస్‌సి వర్గీకరణ చేయాలని స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఎస్‌సి వర్గీకరణ గురించి వివరించారన్నారు. గాంధీ భవన్ దగ్గర కొంత మంది మాదిగలు ఆత్మహత్య చేసుకుంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శలు గుప్పించారు. తెలంగాణ కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్లందిరికి ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని హరీష్ రావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News