Wednesday, January 22, 2025

మాపై బురద జల్లేందుకే శ్వేతపత్రం: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తాను మాట్లాడుతున్నప్పుడు మంత్రులు నోట్ చేసుకోవాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్ రావు సూచించారు. నీటిపారుదలరంగం శ్వేతపత్రంపై అసెంబ్లీ స్వల్పకాలిక చర్చ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. తాను మాట్లాడిన తరువాత స్పందించవచ్చని మంత్రులకు సూచించారు. తాను మాట్లాడినప్పుడు మధ్య మాట్లాడితే అసలు విషయం పక్కదారి పడుతుందని సూచించారు. గత ప్రభుత్వంపై బుదర జల్లే ఉద్దేశంతోనే శ్వేతపత్రాన్ని సభలో ప్రవేశపెట్టారని, శ్వేతపత్రాన్ని ఇప్పుడే ఇచ్చారని, ఇంత తక్కువ సమయంలో నాలుగు సత్యదూరమైన అంశాలు మాట్లాడారని చురకలంటించారు. మిడ్‌మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తి చేశామన్నది అసత్యమని, ఈ ప్రాజెక్టులను పూర్తి చేసిందే తామేనని హరీశ్ రావు స్పష్టం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో అన్నీ అసత్యాలే చెప్పారని ధ్వజమెత్తారు. ఎన్ని గంటలైనా చర్చిద్దామని, ఎంత సమయమైనా కేటాయిస్తామని సభా నాయకుడు చెప్పారని, కానీ ఇంత మంచి విషయం 30 నిమిషాల్లో చెప్పడం సాధ్యం కాదన్నారు. కనీసం తనకు రెండు గంటలైనా సమయం కేటాయించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News