Wednesday, January 22, 2025

సిఐడి విచారణ చేస్తే పెద్ద రిపోర్ట్ వచ్చింది: మాజీ మంత్రి హరీశ్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్లు గ్లోబెల్స్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని తెలిపారు. నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగివచ్చినట్టు అయ్యిందని ఎద్దేవా చేశారు. కెసిఆర్‌కు పనితనం తప్ప పగతనం తెలియదన్నారు. నిజంగా కెసిఆర్ అనుకుంటే సగం మంది కాంగ్రెస్ నాయకులు జైల్లో ఉండేవారని హెచ్చరించారు. హౌసింగ్ స్కాములపై సిఐడి విచారణ చేస్తే పెద్ద రిపోర్ట్ వచ్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News