Thursday, January 23, 2025

సన్‌ప్లవర్ రైతులు రూ.2 వేలు నష్టపోతున్నారు: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మద్దతు ధర లేక సన్‌ప్లవర్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎంఎల్‌ఎ హరీశ్ రావు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్ రావు లేఖ రాశారు. సన్‌ఫ్లవర్ మద్దతు ధర రూ.6760గా ఉందని, కానీ రైతులు రూ.4 వేల నుంచి 5 వేలకే అమ్ముకుంటున్నారని, రైతులు ప్రతి క్వింటాలుకు రూ. 2వేలు నష్టపోతున్నారని, బిఆర్‌ఎస్ హయాంలో మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా సన్‌ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. మద్దతు ధరకు సన్‌ఫ్లవర్ కొని రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్ రావు తెలిపారు. హామీలు తప్పా ఆచరన కాంగ్రెస్ కాంగ్రెస్‌కు సాధ్యం కావడంలేదని, 22 రోజులు గడుస్తున్నా అంగన్వాడీలకు జీతాలు రాలేదని, నెలంతా పని చేసి జీతం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందని, ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News