Sunday, December 22, 2024

సహాయక చర్యలపై హరీశ్ రావు వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: మాజీ మంత్రి హరీశ్ రావు మంగళవారం ఖమ్మం జిల్లాలోని వరద ప్రాంతాల్లో పర్యటించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. వరదల్లో సర్వం కోల్పోయి బాధితులు కట్టు బట్టలతో మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో 30 మంది చనిపోతే ప్రభుత్వం 15 మందే చనిపోయారని చెబుతోందని విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మృతుల కుటుంబాలకు ఏదో తూతూ మంత్రంగా నష్టపరిహారం ప్రకటించారని, మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరదలకు ఇంత భారీ నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఎన్ డిఆర్ఎఫ్ బలగాలను పంపలేదని హరీశ్ రావు ప్రశ్నించారు.

వరద సహాయక చర్యల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యాయని విమర్శించారు. వర్షం తగ్గిన విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదన్నారు. వరద బాధితులు మంచి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News