Monday, December 23, 2024

నడ్డాకు దమాక్ ఉందో లేదో అర్థం కావడం లేదు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao comments on JP Nadda

జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరంపై బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నోటికొచ్చినట్టు మాట్లాడారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బిజెపి, కాంగ్రెస్ పై ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. నడ్డాకు దమాక్ ఉందో లేదో అర్థం కావడం లేదన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంత్రి హరీష్ రావు పర్యటటిస్తున్నారు. భూపాలపల్లిలో వంద పడకల ఆస్పత్రిని ప్రారంభించారు. 250 పడకల జిల్లా ఆస్పత్రి, 50 పడకల ఆయుష్ ఆస్పత్రి భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రూ.102 కోట్లతో భూపాలపల్లిలో ప్రారంభోత్సవాలు చేసుకున్నామన్నారు. వంద పడకల ఆస్పత్రిని ప్రారంభించుకున్నామని, ఆరు కోట్ల రూపాయలతో రేడియాలజీ, పాథాలజీ ల్యాబ్ కు శంకుస్థాపన చేసుకున్నామని,  నూబర్న్, బేబీ కేర్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేసుకున్నామని, రాబోయే రోజుల్లో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

సీటీ స్కాన్ ను కూడా మంజూరు చేస్తామని, భూపాలపల్లిలో పిహెచ్ సి నుంచి మెడికల్ కాలేజ్ స్థాయి వచ్చిందంటే సిఎం కెసిఆరే కారణమన్నారు. నార్మల్ డెలివరీపై మహిళలకు ఆశావర్కర్లకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. త్వరలో సిఎం కెసిఆర్ న్యూట్రీషన్ కిట్ ఇవ్వబోతున్నారని, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర్రాలలో కరెంట్, నీళ్లు ఆస్పత్రులు ఎలా ఉంటాయో చూడాలన్నారు. కాళేశ్వరం నుంచి నీళ్లు వచ్చినయో లేదో భూపాలపల్లి రైతులను అడిగితే తెలుస్తదన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని కేంద్రమంత్రే చెప్పిండని, కాంగ్రెస్ హయాంలో ఎరువులు, కరెంట్ కొరత ఎలా ఉండేదని ప్రశ్నించారు. ఓటుకు నోటు పార్టీ కాంగ్రెస్ అని, సిఎం సీటుకు నోటు పార్టీ బిజెపి అని ఎద్దేవా చేశారు. గ్రామ పంచాయతీ ఉన్న భూపాలపల్లిని జిల్లా చేసింది కెసిఆర్ అని ప్రశంసించారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపి దయాకర్, ఎంఎల్ఎ గండ్ర పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News