Sunday, February 23, 2025

ఇదేనా ప్రజాపాలన ?

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ‘ప్రజాపాలన”లో సాటి ప్రజాప్రతినిధులను అవమానపరుస్తున్న మంత్రుల వైఖరి గర్హనీయమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. మొన్న రైతు బంధు రాదన్న వారిని చెప్పుతో కొట్టండని పిలుపునిచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి నేడు యాదాద్రి భువన గిరి జెడ్పి ఛైర్మన్ సందీప్ రెడ్డిపై అధికారిక కార్యక్రమంలో అకారణంగా దుర్భాష లాడటం కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని మండిపడ్డారు.

మాట్లాడింది చాలదన్నట్టు మంత్రి పోలీసులకు హుకుం జారీ చేసి బలవంతంగా సందీప్ రెడ్డిని బయటకు పంపిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా కోమటి రెడ్డి పోకడలను తీవ్రంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కోమటి రెడ్డికి ప్రజాస్వామ్యం మీద ఏ మాత్రం నమ్మకమున్నా.. జిల్లా పరిషత్ ఛైర్మన్ సందీప్ రెడ్డికి తక్షణమే క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News