Monday, March 17, 2025

కృష్ణ నీళ్లపై రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు : హరీష్‌రావు

- Advertisement -
- Advertisement -

కృష్ణ నీళ్లపై రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని హరీష్‌రావు మండిపడ్డారు. కెసిఆర్ మహబూబ్ నగర్‌కి అన్యాయం చేశారని సిఎం అన్నారని, కెసిఆర్ విజన్ ఉన్న నాయకుడు కాబట్టే కృష్ణాలో హక్కుగా రావాల్సిన నీటికి రాబట్టేందుకు కాలుకు బలపం కట్టుకుని ప్రధానమంత్రిని, నీటిపారుదల శాఖ మంత్రిని, సుప్రీంకోర్టు మెట్లని ఒప్పించి మెప్పించి సెక్షన్ 3ని సాధించారని గుర్తు చేశారు. సెక్షన్ 3 వచ్చింది కాబట్టి 70 శాతం కృష్ణానది నీటి వాటా రాడానికి మార్గం సులభం చేశారని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రకారం వెళ్తే ఉన్న 811 టిఎంసిలు పంచుకునే పరిస్థితి ఉండేదని, రాష్ట్రం ఏర్పడ్డ నెల రోజుల్లోనే కెసిఆర్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి తమకు ట్రిబునల్ ఏర్పాటు చేయాలని అడిగారని చెప్పారు. నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లను పంచాలనే ప్రయత్నాన్ని మొదటి నెలలోనే ప్రారంభించారని తెలిపారు. కానీ శాశ్వతంగా కృష్ణ వాటాని వదులుకున్నామని సిఎం అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటి క్రాప్ ఇయర్ ప్రారంభమైందని, నీళ్లను రెండు రాష్ట్రాలు ఏవిధంగా వాడుకోవాలనే దానిపై ఢిల్లీకి వెళ్ళామని తెలిపారు. తెలంగాణ నుండి ఎస్‌కె జోషి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదిత్య నాథ్ దాస్ సమావేశానికి హాజరయ్యారని గుర్తు చేశారు. తెలంగాణకు నీటి పంపకాల విషయంలో అన్యాయం జరగడానికి కారణమైన ఆదిత్య నాథ్ దాస్‌ను రేవంత్‌రెడ్డి సలహాదారుగా నియమించుకున్నారని మండిపడ్డారు. తెలంగాణకు ప్రాజెక్టులు రాకుండా తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆదిత్య నాథ్ దాస్ కు సుప్రీంకోర్టు జరిమానా విధించిందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి చేసిన కేటాయింపులు, తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో కట్టిన ప్రాజెక్టుల నీటి కేటాయింపులు 512, 299గా ఉందని ఉందని వివరించారు. కాంగ్రెస్, టిడిపి పాలకులు తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల కృష్ణాలో తెలంగాణకు తగిన వాటర్ రాలేదని, ఈ ద్రోహానికి, అన్యాయానికి కారణం మీరే కదా..? కాంగ్రెస్ నేతలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్‌లో 512 టీఎంసీల వినియోగం ఉండే ప్రాజెక్టులు కడితే తెలంగాణలో 299 టిఎంసిలు వినియోగం కలిగిన ప్రాజెక్టులు మాత్రమే నిర్మించారని అన్నారు. ఇంకా ట్రిబ్యునల్ ముందు వాదనలు కొనసాగుతున్నామని, మన రాష్ట్రం నుండి మెరుగైన వాదనలు వినిపిస్తే 575 టిఎంసిల నీళ్లు తెలంగాణకు వస్తే శాశ్వతంగా కృష్ణాజలాల్లో తెలంగాణకు వాటా దక్కుతుందని చెప్పారు. కెసిఆర్ సంతకం పెట్టారని అబద్ధపు మోసపూరిత మాటలు మానాలని హితవు పలికారు. రాహుల్ బొజ్జా మీడియా సమావేశంలో తాత్కాలిక ఒప్పందాన్ని కొనసాగించడానికి అంగీకరించామని ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ప్రాస కోసం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాతున్నారని మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద పోరాడింది ఎవరు..? అని అడిగారు. కెసిఆర్‌ను మహబూబ్ నగర్‌లో గెలిపిస్తే ఏం చేశారని రేవంత్ రెడ్డి అన్నారని చెప్పారు. పాలమూరు కరువుకు, పాలమూరు వలసలకు కారణం కాంగ్రెస్, టిడిపి పార్టీలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్వకుర్తి ప్రాజెక్టుకు ప్రతి సంవత్సరం ఐదు కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రతిపాదించి ఐదు రూపాయలు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీ జల యజ్ఞం పేరిట తెలంగాణ ప్రాజెక్టులపై డబ్బులు దోచుకుని పెండింగ్‌లో పెట్టారని చెప్పారు. ఆ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసింది బిఆర్‌ఎస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు 4 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రాజెక్టు పంప్ హౌస్‌ల వద్ద నిద్రపోయి 10 లక్షల ఎకరాలకు నీరు అందించామని అన్నారు. వలసలు వాపస్ తెచ్చింది బిఆర్‌ఎస్… పాలమూరు పచ్చబడేలా చేసింది బిఆర్‌ఎస్ అని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News