Thursday, December 19, 2024

ఉమ్మడి ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించే కుట్ర: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం జరిగింది నీటి కోసమని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించే కుట్ర జరుగుతోందని దుయ్యబట్టారు. కెఆర్‌ఎంబికి అప్పగిస్తే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. నీళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని సూచించారు. కెఆర్‌ఎంబికి అప్పగించాలన్న నిర్ణయాన్ని గతంలో తాము వ్యతిరేకించామన్నారు. కెఆర్‌ఎంబితో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని తాము వాదించామని, అపెక్స్ కమిటీకి అప్పగించాలని తాము గట్టిగా చెప్పామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు మంజూరు చేసే సమయంలోనే ప్రణాళిక సంఘం కొన్ని షరతులు పెట్టిందని, శ్రీశైలంలో 830 అడుగుల నీటిమట్టం నిర్వహించాలని సూచించిందన్నారు. ప్రాజెక్టుల అప్పగింతపై గతంలో తమ ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టిందని హరీష్ రావు వివరించారు. జాతీయ ప్రాజెక్టు తెస్తామని ఢిల్లీకి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు ఉన్న ప్రాజెక్టులు అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News