Thursday, January 23, 2025

డబుల్ ఇంజిన్ డాంబికాలు

- Advertisement -
- Advertisement -

బిజెపి పాలిత కర్నాటకలో ఐదువందలే పింఛన్..మన దగ్గర రూ.2వేలు
రైతులకు బిజెపి సహాయం రూ.6వేలు…తెలంగాణలో రైతుబంధు ఎకరానికి
రూ. 10వేలు కర్నాటకలో సాగుకు ఆరేడు గంటలే విద్యుత్…ఇక్కడ
24గంటలు పవర్ బిజెపి చెబుతున్న డబుల్ ఇంజిన్ ప్రగతంతా డొల్ల
జిడిపి పెంచమంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచిండ్రు
మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/సంగారెడ్డి/వట్‌పల్లి/జోగిపేట/హైదరాబాద్: బిజెపి ప్రభుత్వం పై రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హ రీష్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ గొప్పలు చెప్పడమే తప్ప…ఆయన హయంలో దే శానికి ఒరిగిన ప్రయోజనం శూన్యమన్నారు. ఎనిమిదేళ్ల మోడీ పాలన అన్ని రంగాల్లో దేశం అధోగతి పాలైందని విమర్శించారు. బిజెపి పాలనలో డబుల్ ఇంజన్ అంటే….మనం ఇస్తున్న ఫిం చన్‌లో కేవలం పావల వంతు మాత్రమేనని ఆయ న ఎద్దేవా చేశారు. బిజెపి పాలత రాష్టమైన కర్నాటకలో ఐదువందలకు మించి ఫించన్ ఇవ్వ డం లేదన్నారు.

పైగా ఎప్పుడు కరెంటు కోతలేనని అ న్నారు. కానీ టిఆర్‌ఎస్ ప్రభుత్వం అర్హులైన వారందరికి రెండువేల రూపాయల చొప్పున ప్రతినెలా అందిస్తోందన్నారు. మన రాష్ట్రం ఇస్తున్న విధంగా దేశంలో ఏ రాష్ట్రం కూడా పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. పైగావ్యవసాయరంగానికి 24 గంటల నాణ్యమైనకరెంటును అందిస్తున్నామన్నారు. ఇది ఒక చరిత్ర అని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. రైతులకు ఎన్ని ఎకరాల భూమి ఉ న్నా రైతుబంధు పేరిట కేంద్రం ఇస్తోంది కేవలం ఆరువేలు మాత్రమేనన్నారు. కానీ టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎకరాకు పదివేల రూపాయల చొప్పున రైతుబంధును అందిస్తోందన్నారు. ఇలా ఏ పథకాన్ని తీ సుకు న్నా కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వమే ప్రజలకు మెరుగైన సంక్షేమాన్ని అందిస్తోందన్నారు. అయినప్పటికీ బిజెపి నాయకులు మాత్రం చౌకబారు రాజకీయాలను మాత్రం మానుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. అబద్దాల యూనివర్సిటీలో డిగ్రీ పట్టాలు తీసుకుని….ప్రతి రోజు రాష్ట్ర ప్రభు త్వం బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆయ న తీవ్ర స్థాయిలో  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదా కేంద్రం చెప్పే డబుల్ ఇం జన్ గ్రోత్ అని ఆయన ప్రశ్నించారు.సోమవారం ఆంథో ల్ నియోజకవర్గంలో తాలెల్మా రేణుక ఎల్లమ్మ ఎత్తిపోథల పథకాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…కేంద్రంపై మరోసారి నిప్పులు చెరిగారు. రాష్ట్రా న్ని అనతికాలంలోనే అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ము ఖ్యమంత్రి కెసిఆర్ తీసుకపోయేందుకు ప్రతి క్షణం తపిస్తున్నారన్నారు. ఇందుకు బాధ్యతగల ప్రతిపక్ష పార్టీలు గా ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి…. ప్రతి అం శాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నాయని విమర్శించారు. ఇదా ప్రజల పట్ల వారికున్న బాధ్యత అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి సహకారం లేకపోయినప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నామన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్…బిజెపి నాయకులు అవాకులు- చెవాకులు మాట్లాడుతుండడం సిగ్గుచేటన్నారు. ప్రజలు ఏదైతే వద్దనుకుంటున్నారో వాటినే బిజెపి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రజలను వేధింపులకు గురిచేస్తోందని విమర్శించారు. మోడీకి పాలన చేతకాక పోవడం వల్లే దేశంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయన్నారు.

దేశ డిజిపి పెంచమంటే… బిజెపి ప్రభుత్వం గ్యాస్, డీజీల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. నల్ల ధనం బయటకు వస్తదని చెప్పి.. పెద్ద నోట్లు రద్దు చేశారన్నారు. దీంతో ఇంట్లో ఉండే చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరిని బ్యాం కుల ఎంటిఎంల ముందు నిలబెట్టిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఎనిమిదేళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం ఎంత నల్ల ధనం తెచ్చారన్న విషయంపై ఇప్పటి వరకు నోరు విప్పలేదన్నారు.

నల్ల చట్టాలను తెచ్చి రైతులను రోడ్లపైకి తెచ్చారు

రైతుల నుండి భూములు లాక్కునేందకే కేంద్రం నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చి… వాళ్లను రోడ్డు మీదకు తెచ్చారని హరీష్‌రావు పేర్కొన్నారు. ఈ చట్టలను వ్యతిరేకించినందుకు లాఠీలతో రైతులను కొట్టించడమే కాకుండా.. తూటాలు పేల్చారని మండిపడ్డారు. కొందరిని కారుతో తొక్కించి చంపారన్నారు. పైగా కేంద్రం మంచి చట్టాలు తెస్తే…ఖలిస్తాన్ తీవ్రవాదులు అడ్డుకుంటున్నారని పే ర్కొంటూ బిజెపి నాయకులు రైతులను తీవ్రంగా అవమానించారన్నారు. ఏడాది పాటు జరిగిన రైతు పోరాటంలో 750 మంది దాకా అసువులు బాశారన్నారు.

చివరకు తప్పయిందంటూ ఆ చట్టాలను మోడీ ప్రభుత్వం వెనక్కు తీసుకుందన్నారు. అలాగే యువత తమకు ఉద్యోగాలు ఇవ్వండి అని కోరుతుంటే… ప్రభుత్వ రంగ సంస్థలను అ మ్ముతున్న దిక్కుమాలిన ప్రభుత్వం బిజెపిదేనని ఆ యన దుయ్యబట్టారు. వాటిల్లో సుమారు 16 లక్షల ఉ ద్యోగాలు ఖాళీగా ఉంటే… కేంద్రం ఒక్క ఉద్యోగం భర్తీ చేయ లేదన్నారు. చివరకు దేశ భద్రతకు సంబంధించిన రక్షణ విభాగంలో కూడా అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే దేశ మిలిటరీని ప్రయివేటు పరం చేస్తున్నారని విమర్శించారు. ఈ విభాగంలో ఔట్ సోర్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు యత్నించడం సిగ్గుచేటన్నారు. అగ్నిపథ్ పేరుతో మోడీ ప్రభుత్వం ఇవాళ దేశంలో అగ్గి రాజేసిందన్నారు. యువ త అశాంతితో ఉడికిపోతున్నారు. వారిని పిలిచి చర్చించాల్సింది పోయి.. కాల్పులు జరిగితే తెలంగాణ యువకుడు అమరుడయ్యాడన్నారు. యువతను బిజెపి రెచ్చగొడుతోందన్నారు. కాల్చుతాం…కేసులు పెడతాం అని బెదిరిస్తోందన్నారు. ఇదేం పాలన? అని మండిపడ్డారు. దేశానికి సేవ చేసే సైనికులకు ఇస్త్రి, కటింగ్ చెయించడం నేర్పుతామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రి హరీష్‌రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఆయనపై ఉందన్నారు.

టిఆర్‌ఎస్సే రాష్ట్రానికి శ్రీరామ రక్ష

టిఆర్‌ఎస్సే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని మంత్రి హరీష్‌రావు అన్నారు. సిఎం కెసిఆరే రాష్ట్రానికి ప్రధాన చౌకీ దార్ అని అన్నారు. ఆయన హయంలో రాష్ట్రానికి ఎటువంచి కష్టం రానివ్వరు.. ఎవరైనా నష్టం చేయాలని చూస్తే సహించరన్నారు. అలాంటి వ్యక్తి సిఎంగా కొనసాగుతున్నంత కాలం.. ఎవరైన్ని విధాలుగా యత్నించినా ఫలితం ఉండదన్నారు. పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రాన్ని కెసిఆర్ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టారన్నారు. అందుకే దేశం ఇప్పుడు మన వైపు చూస్తోందన్నారు. ఇవాళ మనం ఏం చేస్తే.. రేపు దానిని ఇతర రాష్ట్రాలు ప్రారంభించాల్సిందేనని అన్నారు..

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

రేణుకా ఎల్లమ్మ ఎత్తి పోతల పథకంతో ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ తీరనుందన్నారు. సింగూరు నీళ్లతో రేణుక ఎల్లమ్మ పాదాలు కడుగుతామని ఇచ్చిన మాటను ప్రస్తుతం నిలబెట్టుకున్నామన్నారు. దీని ద్వారా మొత్తం 14 గ్రామాల్లో 3000 ఎకరాలకు సాగు నీటి కొరత తీరుతుందన్నారు. సమీపంలోనే సింగూరు జలాశయం ఉన్నా, ఈ ప్రాంతాలు తడిచే పరిస్థితి లేదన్నారు. ఇక్కడి ప్రాంతాల రైతులకు ఇప్పటి వరకు చుక్క నీరు అందలేదన్నారు. రైతుల కష్టాలు తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం 2017..20-18 లో తాలెల్మా శివారులో రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందని మంత్రి హరీష్‌రావు గుర్తు చేశారు. ప్రస్తుతం 3 వేల ఎకరాలు, బీడు భూములకు నీరు అందించడం ద్వారా మొత్తం 6 వేల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని ఏ ఒక్క నీటి ప్రాజెక్ట్‌కు సాయం చేయడం లేదన్నారు. సమైక్య రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా దుస్థితి అని అన్నారు. పాలకుల నిర్లక్ష్యంతో పూర్తి వివక్షకు గురైన ఈ ప్రాంతా న్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్‌అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చారన్నారు. సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయడంతో పాటు సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, అందోలు నియోజవకవర్గాల్లోని 3.90లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూ.4427 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలను నిర్మించాలని నిర్ణయించిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News