Friday, December 27, 2024

బిజెపోళ్లు ఢిల్లీలో మెచ్చుకుంటారు… గల్లీలో తిడుతారు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : మత్స్య సంపద అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేటలో పి.వి. నరసిహావరావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయ భవన సముదాయానికి మంత్రులు మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు. రైతు ఏడ్చిన రాష్ట్రం ముందుకు పోదంటారని, మూగజీవాలకు కూడా కెసిఆర్ నాయకత్వంలో విస్తృత సేవలు అందిస్తున్నామని చెప్పారు. బిజెపోళ్లు ఢిల్లీలో మెచ్చుకుంటారు.. గల్లీ లో తిడతారా ? చురకలంటించారు. మిషన్ భగీరథ, రైతుబందు ను కూడా నఖలు కొట్టి దేశమంతా అమలు చేస్తున్నారని మోడీ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. మోడీ ప్రభుత్వం తెలంగాణకు అవార్ఫుల మీద అవార్డులు ఇస్తున్నారని, కానీ గల్లీ లోకి వచ్చి బిజెపి నేతలు తిడతారని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ వాళ్లు పివికి ఘాట్ కట్టడానికి అనుమతి ఇవ్వలేదని, ఈ వైద్యశాలకు పివి పేరు పెట్టుకుని వారి గౌరవాన్ని సిఎం కెసిఆర్ పెంచారని, కాళోజీ, కొండ లక్ష్మణ్ బాపూజీ పేర్లతో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకున్నామని హరీష్ రావు ప్రశంసించారు. గత ప్రభుత్వాలు వీరిని పట్టించుకోలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నిండు ఎండాకాలంలో నూ జలసిరి పెరిగి అలుగు పారుతున్నాయని, సిద్దిపేట జిల్లలో 12460 మందికి మత్స్య కారులకు కొత్తగా సభ్యత్వం ఇస్తుందని, 3.70 లక్షల మందికి రెండో విడత గొర్ల పంపిణీ చేస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు. వెటర్నరీ కాలేజ్ సిద్దిపేటకు ఇచ్చినందుకు సిఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. విద్యను సిఎం కెసిఆర్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జడ్పి చైర్ పర్సన్ రోజా శర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News