Wednesday, January 22, 2025

జనగామ బిఆర్ఎస్ గడ్డ.. పల్లా గెలుపు ఖాయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జనగామ బిఆర్ఎస్ గడ్డ.. ఇక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయమని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ నెల 16న జనగామలో అన్ని వర్గాలను కలుపుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ సభను లక్ష మందితో విజయవంతం చేయాలని మంత్రి హరీశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. టికెట్ రాకున్నా పల్లా గెలుపునకు ముత్తిరెడ్డి సహకరిస్తున్నారని కొనియాడారు. టికెట్లు రాకుండానే కాంగ్రెస్ నేతలు తన్నుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీకి 11సార్లు అవకాశం ఇచ్చినా చేయలేని పనులు 10 ఏళ్లు నిండకముందే కెసిఆర్ చేసి చూపించాడు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే… రాష్ట్రం పాతాళంలోకే పోతుందని మంత్రి హరీష్ ఆరోపించారు. నాయకులు ఇద్దరు కలిసి పోయారు కాబట్టి కార్యకర్తలు కూడా మనస్పర్ధలు లేకుండా కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. జనగామలో గెలుపు విషయంలో అనుమానం లేదు మెజార్టీ ఎంత అనేది ముఖ్యం. సిద్దిపేటలో నాతో పక్కన దయాకర్ రావుతో పోటీ పడాల్సిందే. కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ పాలనకు చర్చకు సిద్ధమంటున్నడు ఒక కాంగ్రెస్ నాయకుడు.

కాంగ్రెస్ పాలన అంటే కరువులు, కర్ఫ్యూలు, కరెంట్ కోతలు అన్నారు. కాంగ్రెస్ పార్టీ 2009లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన, చెప్పని హామీలను నెరవేర్చిన నాయకులన్నారు. ఎన్నికల హామీలో లేని రైతుబంధు చేసిండు ఇంటింటికి మిషన్ భగీరథ మంచినీళ్లు ఇవ్వడం ఇలా ఒకటి కాదు అనేక కార్య్రమాలు చేసి చూపించాడు. కర్ణాటకలో కాంగ్రెస్ అమలు చేయని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి చేతులు ఎత్తేశారని ఆయన విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News