Monday, December 23, 2024

రాజకీయంగా ఎదుర్కోలేకే పల్లాపై అక్రమ కేసులు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయనపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.  అక్రమంగా కాలేజీలు నిర్మిస్తే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూలుస్తారని చెప్పారని, ఆయనను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు హైడ్రా పేరుతో రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అన్ని అనుమతులు తీసుకొని నిర్మించిన భవనాలు ఎందుకు కూల్చుతున్నారని హరీష్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో చేరకుంటే బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షకు విద్యాసంస్థలు బలికాకూడదని హెచ్చరించారు. తెలంగాణలో 36 శాతం డెంగీ కేసులు పెరిగినా కూడా ప్రభుత్వంలో చలనం కనిపించడంలేదని, ఆరోగ్యశాఖపై ఎలాంటి సమీక్ష లేవని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు లేవని, ప్రజల ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదన్నారు. తెలంగాణలో పారిశుద్ధం కూడా అస్తవ్యస్తంగా మారిందని విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News