Wednesday, January 22, 2025

మధ్యప్రదేశ్ లో వ్యాపం కుంభకోణం సంగతేంటి? శివరాజ్ సింగ్: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao comments on Shiva raj singh chaun

సిద్దిపేట: మద్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్ లో రైతుబంధు వేడుకలలో హరీష్ రావు మాట్లాడారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాఖాహారి అన్నట్లు శివరాజ్ సింగ్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్, సిఎం కెసిఆర్ ను విమర్శించే నైతిక హక్కు శివరాజ్ సింగ్ కు లేదన్నారు. దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని‌ ముఖ్యమంత్రి అయ్యావని హరీష్ రావు దుయ్యబట్టారు. నాలుగేళ్లు సిఎంగా ఉండి ఏం సాధించావని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం దేనిలో పోటీ పడుతుందో చెప్పాలని నిలదీశారు. ఏ రంగంలో మీ రాష్ట్రం అభివృద్ధి సాధించిందో చెప్పాలని సవాలు విసిరారు. మధ్యప్రదేశ్ లో జరిగిన వ్యాపం కుంభకోణం సంగతేంటని ప్రశ్నించారు. 317 జివొ రద్దు చేయాలా‌‌? అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేశారా? అని హరీష్ రావు అడిగి ప్రశ్నించారు. కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని చెప్పారని, ఈ విషయం కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తెలియదా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు‌ రావాలని సిఎం కెసిఆర్ భావిస్తుంటే, ఉద్యోగాలు రావద్దని బిజెపి కుట్ర చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అని ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని విరుచుకపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News