Thursday, December 26, 2024

అప్పుడు ప్రకృతి కరువు తెస్తే… ఇప్పుడు కాంగ్రెస్ కరువు తెచ్చింది: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తమపై దాడులు చేసిన వారిపై ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయలేదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు తెలిపారు. తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదు అని అధికారులు తీరు మార్చుకోవాలని సూచించారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు విర్రవీగారని, ఇప్పుడు సస్పెండ్ అవుతున్నారని, అధికారంలో ఉన్నామని విర్రవీడితే ఎపిలో అధికారులకు పట్టిన గతే పడుతుందని హరీష్ రావు హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో పంట పొలాలు ఎండిపోతున్నాయని, పాలేరు జలాశయానికి వంద మీటర్ల దిగువన కాలువకు సెప్టెంబర్ 1న గండిపడిందని తెలియజేశారు. పాలేరు జలాశయానికి సంబంధించిన కాలువకు గండిపడి 22 రోజులవుతున్నా ఎందుకు పూడ్చలేదని, సాగర్ నిండుకుండలా ఉన్నా సాగర్ ఆయకట్టు రైతుల పంటలు ఎండుతున్నాయని, పోయిన సంవత్సరం వర్షాలు పడక పంటలు ఎండిపోయాయని, ఇప్పుడు ప్రభుత్వం చేతగానితనం వల్ల  పంటలు ఎండుతున్నాయని, గత సంవత్సరం ప్రకృతి కరువు తెస్తే ఇప్పుడు కాంగ్రెస్ కరువు తెచ్చిందని హరీష్ రావు చురకలంటించారు. లక్షల మంది రైతులు నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వానికి కూల్చివేతలు తెలుసు తప్ప పూడ్చివేతలు తెలియదని ఎద్దేవా చేశారు. పేద ప్రజల ఇండ్లు కూల్చుతూ హైడ్రా పేరుతో హైడ్రామా నడిపిస్తున్నారని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News