Sunday, December 22, 2024

మేధావులు, విద్యావంతులు పోలింగ్ లో పాల్గొనాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: తన కుటుంబ సభ్యులతో కలిసి భారత్ నగర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నానని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ అంబిటస్ స్కూల్ లో 114 పోలింగ్ బూత్ లో కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా ముమ్మరంగా ప్రజలు పోలింగ్ లో పాల్గొన్నాలని, గతంలో కంటే ఈ సారి ఎక్కువగా పట్టణాలలో పోలింగ్ పెరుగుతుందని అని చెప్పారు. ప్రశ్నించే గొంతుక ఉండాలని ప్రజలు ఆలోచన చేస్తున్నారని, మేధావులు, విద్యావంతులు పోలింగ్ లో పాల్గొనాలని హరీష్ రావు సూచించారు. ప్రజాస్వామ్యం బలపడలంటే అందురు ఓటింగ్ లో పాల్గొనాలని, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ దేశం అని, గత పార్లమెంటు ఎన్నికలలో కంటే పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News