- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలనా దక్షత లేదని బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మరోకసారి విరుచుకుపడ్డారు. జనగాంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి సిఎం గ్రహణంలా పట్టారని, ముందు చూపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలన 20-20 కమీషనే అన్నారు. ఏ పని పూర్తి కావలన్నా 20 కమీషన్ ఆయనకు ముట్టాల్సిందేనని ఆరోపించారు. పాలన చేతకాక ప్రకృతి, ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారని తెలిపారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు…రేవంత్ తెచ్చిన కరువు అని, కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాకే నీళ్లంతా సముద్రపు పాలు చేశారని హరీష్ రావు మండిపడ్డారు.
- Advertisement -