Tuesday, February 11, 2025

48 గంటల్లో క్లియర్ చేస్తామని ఉత్తమ్ చెప్పారు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అన్ని పంటలకు బోనస్ అన్న మాట బోగస్ అని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల ముందు కూతలు… ఎన్నికలయ్యాక కోతలని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కోతల సర్కార్ అని హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రైతులకు రూ. 432 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. 48 గంటల్లో క్లియర్ చేస్తామని ఉత్తమ్ చెప్పారని, ఉత్తమ్ కుమార్ మాటలు.. ఉత్తర కుమార ప్రగల్బాలేనని మండిపడ్డారు. సన్న వడ్లకు బోనస్ విషయంలో రైతుల్ని దగా చేశారని తెలియజేశారు. పంటలకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదని బాధను వ్యక్తం చేశారు. రైతుల్ని ఈ ప్రభుత్వం మోసం చేస్తోందని, కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలని ప్రజలు చూస్తున్నారని హరీష్ రావు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News