Sunday, January 26, 2025

అక్రమ కేసులకు, బెదిరింపులకు భయపడం: హరీశ్‌ రావు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి మండిపడ్డారు. అక్రమ కేసులకు, బెదిరింపులకు బిఆర్ఎస్ భయపడదన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను  తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు అన్నారు. పేదల ఇళ్లు ఎందుకు కూలగొట్టారని ప్రశ్నించినందుకు కేసులు పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం తగదని హెచ్చరించారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న వారి గొంతు నొక్కడమేనా ప్రజాపాలన? అంటే అని నిలదీశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటామని, బిఆర్ఎస్ నేతలపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News