బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ధర్మేందర్ రెడ్డికి పలువురు పరామర్శ.
మన తెలంగాణ/మోత్కూరు: యాదాద్రి జిల్లా మోత్కూరు మండలంలోని దాచారం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నేవూరి ధర్మేందర్‌రెడ్డిని, కుటుంభ సభ్యులను మంగళవారం మాజీ మంత్రి, సిద్ది పేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు పరామర్శించారు. ధర్మేందర్‌రెడ్డి తల్లి పిచ్చమ్మ మృతి చెందడంతో మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ,నాయకులు ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, పైళ్ళ శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య,కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కార్పోరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్,స్వామి యాదవ్ , బీఆర్‌ఎస్ యాదాద్రి జిల్లా అద్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మండల అద్యక్షులు పొన్నెబోయిన రమేష్, కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి,మోత్కూర్ పట్టణ అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగ శ్రీను, గజ్జి మల్లేష్, మార్కెట్ మాజీ చైర్మర్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, నాయకులు దాసరి తిరుమలేష్, మాదాను ఆంథోని, పూలపెల్లి జనార్ధన్‌రెడ్డి, అండెం రాజిరెడ్డి, బొనగ నరేందర్‌రెడ్డి,చౌగోని సత్యంగౌడ్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.