Wednesday, January 22, 2025

సాయిచంద్ మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టిన హరీశ్ రావు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ అకస్మిక మృతిపట్ల మంత్రి హరీశ్ రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. బుధవారం అర్థరాత్రి సాయిచంద్ కు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. సాయిచంద్ మరణ వార్త విన్న మంత్రి హరీశ్ రావు, కేర్ ఆస్పత్రికి చేరుకుని సాయిచంద్ మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టారు.

సాయిచంద్ అకస్మిక మృతిపట్ల మంత్రి సంతాపం తెలిపారు. సాయిచంద్ అకాల మరణం ఎంతో బాధించిందన్నారు. ఆట, పాటతో తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ గొప్పపాత్ర పోషించారని మంత్రి అన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రర్థిస్తున్నానని పేర్కొన్నారు. సాయిచంద్ కుటుంబ సభ్యులకు మంత్రి హరీశ్ రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Also Read: సాయిచంద్ మృతిపట్ల మంత్రుల సంతాపం..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News