Monday, December 23, 2024

సిద్ధిపేట ముద్దుబిడ్డ ఇండియన్ ఐడల్ రన్నరప్ లాస్యప్రియపై హరీష్ రావు ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆహా ఓటీటీలో నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్-2023 కార్యక్రమం ముగిసింది. ఈ సీజన్-2 పోటీల్లో సౌజన్య విజేత కాగా, లాస్యప్రియ రన్నరప్‌గా నిలిచింది. లాస్యప్రియ సిద్ధిపేట అమ్మాయి. దాంతో, మంత్రి, స్థానిక ఎంఎల్‌ఎ హరీష్ రావు స్పందించారు. సిద్ధిపేట ముద్దుబిడ్డ అంటూ లాస్యప్రియపై ప్రశంసల జల్లు కురిపించారు.

తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో రన్నరప్ గా నిలిచిన లాస్యప్రియకు హృదయపూర్వక అభినందనలు అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు. మున్ముందు లాస్యప్రియ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. తెలుగు సంగీతంలోని మాధుర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గాయకులందరికీ గొప్ప భవిష్యత్ ఉండేలా దీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News