Thursday, January 23, 2025

ముఖ్యమంత్రికి మాజీ మంత్రి శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన భట్టి విక్రమార్క, మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నానని హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారానికి హైదరాబాద్ విచ్చేసిన ఏఐసిసి చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఏఐసిసి అగ్ర నాయకులు  రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి సిఎల్పీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News