Monday, December 23, 2024

ఉస్మానియా వైద్యులకు మంత్రి హరీష్ రావు అభినందనలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఉస్మానియా వైద్యులను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అభినందించారు. క్యాథ్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందిస్తున్న సేవల పట్ల, ఆర్థో శస్త్ర చికిత్సల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉస్మానియా సూపరింటెండ్ డాక్టర్ నాగేందర్, కార్డియాలజీ విభాగం హెడ్ డాక్టర్ ఇమాముద్దిన్, ఆర్థోపెడిక్ సర్జరీ విభాగం హెడ్ జి.రమేష్ సోమవారం అరణ్య భవన్‌లో మంత్రిని కలిశారు. ఈ సందర్బంగా ఉస్మానియాలో అధునాతన వైద్య పరికరాలతో నిర్వహిస్తున్న శస్త్ర చికిత్సల గురించి వివరించారు. 15 రోజుల క్రితం అందుబాటులోకి వచ్చిన క్యాథ్ ల్యాబ్ వల్ల ఇప్పటి వరకు 50 కరోనరీ అంజియోగ్రామ్, 30 స్టెంట్స్, 3 ఫ్లురో స్కోపి వంటి చికిత్సలు అందించినట్లు తెలిపారు. దీంతో పాటు గత నెలలో 4 తుంటి మార్పిడి, 2 మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలు చేసినట్లు మంత్రికి వివరించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు.. ఉస్మానియా వైద్యులను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ వైద్యారోగ్య శాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నారని, అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చుతున్నారన్నారు. ఈ వైద్య పరికరాలు పూర్తి స్థాయిలో వినియోగించుకొని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News