Wednesday, April 30, 2025

SLBC కంటే పెద్ద డిసాస్టర్ ఇంకొకటి లేదు.. మంత్రి ఉత్తమ్ కు హరీష్ రావు కౌంటర్

- Advertisement -
- Advertisement -

దేశంలో బ్రోకర్లకు లంచం ఇచ్చి ప్రైవేటు సంస్థల దగ్గర అప్పు తెచ్చిన ఏకైక దౌర్భాగ్య ప్రభుత్వం మీదని కాంగ్రెస్ పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. మేము మీలాగా సిగ్గులేకుండా బ్రోకర్లను పెట్టుకొని, కమిషన్లు ఇచ్చి రూ.10 వేల కోట్లు అప్పు తీసుకోలేదని దుయ్యబట్టారు. ఎన్ డిఎస్ఏ ఇచ్చిన నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వం..  BFC, REC వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్ద అప్పు తీసుకున్నామన్నారు.తాము చేపట్టిన ప్రాజెక్టులో తప్పులు ఉంటే కేంద్ర ప్రభుత్వం అప్పు ఎందుకు ఇస్తుందని ప్రశ్నించారు.

SLBC కంటే పెద్ద డిసాస్టర్ ఇంకొకటి లేదని.. ఆగమాగం పనులు చేపించి 8 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్న నీచపు ప్రభుత్వం మీదని మండిపడ్డారు. 60 రోజులైనా ఇంతవరకు వాళ్ల శవాలు కూడా తీయడం చేతకాని దద్దమ్మ ప్రభుత్వం మీదని విమర్శించారు. “కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది.. వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది.. పెద్ద వాగు కొట్టుకుపోయింది.. ఎస్ఎల్బీసీ కూలిపోయింది.. ఇంతకన్న డిసాస్టర్ ఏముంటుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News