- Advertisement -
గ్రూప్స్ అభ్యర్థులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన బిఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, ముఠా గోపాల్, దాసోజు శ్రవణ్ సహా ఇతర నాయకులను అరెస్టు చేయడాన్ని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్,- బిజెపికి మధ్య ఉన్న చీకటి ఒప్పందం మరోసారి బట్టబయలైందని ఆరోపించారు. బిజెపికి ఒక న్యాయం…?..బిఆర్‌ఎస్‌కు ఒక న్యాయమా..? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ గంటల పాటు నిరసన తెలియచేస్తూంటే అడ్డుకోని కాంగ్రెస్ ప్రభుత్వం, బిఆర్‌ఎస్ నాయకులను మాత్రం అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రాజకీయాలు పక్కనబెట్టి ముందు విద్యార్థుల సమస్య పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆపండి అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
- Advertisement -