మనతెలంగాణ/నార్సింగి: కాంగ్రెస్ ప్రభుత్వం పేద మధ్య తరగతి ప్రజలపై హైడ్రా అనే డ్రామాతో పేదల ఉసురుపోసుకుంటున్నారని టిఆర్‌ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గండిపేట మండలంలోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని గంధంగూడ, బైరాగిగూడ మూసీ రివర్‌బెడ్ పరిధిలోని హైడ్రా బాధితులను బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, టేశీనివాస్ యాదవ్, అలీ, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, మధుసుదనాచారి, కౌశిక్‌రెడ్డి, ముఠా గోపాల్, నరేందర్ రెడ్డి, రాజేంద్రనగర్ బిఆర్‌ఎస్ యువనేత కార్తీక్ రెడ్డిల బృందం, నాయకులు కలిసి పెద్ద ఎత్తున నిరసన తె లుపుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇం ద్రారెడ్డి మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం అమలవుతుందన్నారు. బిఆర్‌ఎస్ పేదల పక్షాన నిలబడి పోరాటం చే స్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పేదవా డి రక్తం, వారి కన్నీళ్ల మీద మూసీ నది సుందరీకరణ చే యటానికి సిద్ధమయ్యారన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను వదిలేసి పేదవాడి ఉసురుపోసుకుంటున్నాడన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ఇవ్వని హామీల కోసం ఉత్సాహం చూపడం సరికాదన్నారు.
ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు
మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఎవ్వరు కూడా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవద్దని అవసరమైతే తామే రక్షణ కవచంగా మీముందుంటామన్నారు. బుల్డోజర్‌లు వచ్చిన త మను దాటుకున్నాకే మీ వద్దకు రావాలన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని, ఇప్పటికే హైడ్రా పుణ్యమా అని ముగ్గురు చనిపోయారన్నారు. అనంతరం బాధితులు ఇండ్ల నిర్మాణాల కోసం సంబంధిత శాఖల దగ్గర తీసుకు న్న అనుమతుల పత్రాలను చూపించగా 1994లో సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హ యాంలో లే అవుట్ కోసం అన్ని అనుమతులు తీసుకు ని, అనంతరం అందులో ప్లాటింగ్ చేశారన్నారు. అందు లో ప్లాట్లు కొన్న వారు ప్రభుత్వానికి చట్టబద్ధంగా ట్యాక్స్ చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఇంటి నిర్మాణం కో సం మున్సిపల్ శాఖ ద్వారా అనుమతులు, కరెంట్, నల్లా బిల్లు, ఇంటి నిర్మాణం అనంతరం యుటిలైజేషన్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వంటి అన్ని రకాలుగా పన్నులు కట్టించుకొని అనుమతులు తీసుకుని ఇండ్లు నిర్మించుకున్నాక, తీరా ఇప్పుడు ఆ లేఅవుట్లు బఫర్ జోన్‌లో, ఎఫ్‌టిఎల్ లో ఉందని నిర్ధాక్షణంగా అమాయక ప్రజల ఇండ్లు కూల్చివేస్తామంటే సహించబోమని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలకు పేదలను బలిచేయవద్దన్నారు.
ఇందిరమ్మ పాలన అని గొప్పలు చెప్పటం కాదని ఇందిరమ్మ పాలన అంటే గరీబీకు అటావ్ అన్నారు. కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ పాలన అంటే గరీబోంకు అటావో అన్న చందంగా మారిందన్నారు. పేదలకు కూడు, గుడ్డ, నీడ అందించేది ఇందిరమ్మ పాలన కానీ పేదలను ఇబ్బందులకు గురిచేయటం ఇందిరమ్మ పాలన కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు కాని ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆపన్నహస్తం అందించేది బదులు పేద ప్రజల నెత్తిపైన భస్మాసుర హస్తాన్ని సంధిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ ని త్యం పదే పదే బుల్డోజర్ రాజ్య్ నహీచలేగా అని హితవుపలకటం కాదని ప్రస్తుతం తెలంగాణలో రేవంత్‌రెడ్డి గుం డాల రాజ్యంలో బుల్డోజర్ పాలన నడుస్తుందని దానిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ హ స్తం గుర్తును తీసివేసి బుల్డోజర్ గుర్తును పెట్టుకోవాలన్నా రు. సామాన్య ప్రజలు, దేశంకోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశం కోసం పోరాడిన సైనికులు సైతం పైసా పైసా కూడబెట్టుకుని 20ఏళ్ల క్రితం ఇండ్ల స్థలాలు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకుంటే, నేడు వారి ఇండ్ల ను కాపాడుకోవటం కోసం పోరాడుతున్న దుస్థితి నెలకొందన్నారు.
రాష్ట్ర ప్రజలకు ఇస్తామన్న ఆరు గ్యారంటీలను తుంగలో తొక్కి మూసీ సుందరీకరణ కోసం లక్షా యాభై వేల కోట్లు ఖర్చు చేస్తా అని మూర్కంగా ప్రవర్తిస్తున్నారన్నారు. ఇదే మూసీనది గుండా అక్రమంగా పెద్ద ఎత్తున బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తున్నారని వారి పై చర్యలు తీసుకోవటం మాని అమాయక ప్రజలను ఇ బ్బందులకు గురిచేస్తే సహించబోమన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ పేదలకు అన్ని విధాలుగా అండగా ఉన్నామని, ప్ర జలు ఆందోళన చెందవద్దని ఎటువంటి సమస్య ఉన్న తెలంగాణ భవన్‌ను ఆశ్రయించాలన్నారు. మీకోసం ప్ర త్యేకంగా పోరాడి కోర్టు ద్వారా స్టే ఆర్డర్ కూడా తీసుకువస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పేద ప్రజలకు సరైన వైద్యం, మందులు లభించక ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారం, పాఠశాలల భవనాలు, మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతుంటే అభివృద్ధి చేయటం మాని పేద ప్రజలను ఇబ్బందిపెడితే ఊరుకోమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, బాధితులు ప్రజ లు తదితరులు పాల్గొన్నారు.