Wednesday, January 22, 2025

ఢిల్లీలో అవార్డులిచ్చి.. గల్లీలో తిడుతుర్రు

- Advertisement -
- Advertisement -

మెదక్: ఢిల్లీలో అవార్డులిచ్చి గల్లీలో తిడుతున్నారని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరిశ్ రావ్ మండిపడ్డారు. జిల్లా నర్సాపూర్ లో మంత్రి హరిశ్ రావ్ గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, పద్మా దేవేందేరెడ్డి, రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. “తెలంగాణ వ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాలకు పొడుపట్టాలు ఇస్తున్నాం. దేశంలో అత్యధిక పట్టాలు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం 10.71 శాతం పొడుపట్టాలిచ్చి దేశంలోనే మొదటిస్తానంలో నిలిచింది. గిరిజనులను పొడుపట్టాలు ఇచ్చి రైతులుగా మార్చింది.

పోడు పట్టాలు పొందిన రైతులకు ఎకరాకు రూ.10వేల రైతుబందు సాయం రాబోతోంది. పోడు పట్టాలు తీసుకున్న రైతులకు ఉచిత కరెంటు ఇస్తాం. ఇప్పటివరకు ఏ ప్రభుత్వ పథకం అందలేదు..నేటి నుంచి సబ్సిడీపై అన్ని అందుతాయి. పంట నష్టం జరిగితే నేటి నుంచి సాయం అందుతోంది. కాంగ్రెస్, బీజేపీలు గిరిజనులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు. కేసీఆర్ రైతు ఎజెండా తో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పరేషాన్ అవుతున్నాయి. కేసీఆర్ ను తిట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు పెట్టుకుంటున్నారు.ప్రధాని మోడీ.. ఢిల్లీలో అవార్డులిచ్చి గల్లీలో తిట్టిపోతుండు. తెలంగాణ పథకాలను ప్రధాని మోడీ కాపీ కోడుతున్నారు. తెలంగాణకు రావాల్సిన రూ.లక్ష కోట్లు అపి.. తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటుంది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: కెసిఆర్ ప్రభుత్వంపై సర్పంచ్ లు ఆగ్రహంగా ఉన్నారు: మోడీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News