Monday, December 23, 2024

దేశంలో రూ.2016 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

- Advertisement -
- Advertisement -

Harish Rao distributes Aasara Pension in Fatehnagar

మన తెలంగాణ/హైదరాబాద్: దేశాన్ని పాలిస్తున్న బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ రాష్ట్రాలలో ఎక్కడైనా వృద్ధులకు రెండు వేల రూపాయల పెన్షన్లు ఇస్తున్నారా? అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. ఇది కేవలం తెలంగాణలో మాత్రమే ఉందన్నారు. సిఎం కెసిఆర్ ఆశీర్వాదంతో రాష్ట్రంలో 46 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. ఇప్పుడు కొత్తగా 10 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.
గురువారం కూకట్ పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ డివిజన్‌లో ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. లబ్ధిదారులకు ఆసరా కార్డులను స్థానిక శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు, ఎంఎల్‌సి నవీన్ కుమార్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా కెసిఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకపోతున్నారన్నారు. అలాగే పెద్దఎత్తున సంక్షేమ పథకాను అందిస్తున్నారన్నారు. వాటిని ఎలాగైనా అడ్డుకోవాలన్న లక్షంతో రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, మోకాళ్ల యాత్రలు చేస్తున్నారని విమర్శించారు.
బిజెపి పాలిస్తున్న రాష్ట్రాలలో పక్కనే ఉన్న డబల్ ఇంజన్ సర్కార్ మహారాష్ట్రలో రూ.2016 పెన్షన్లు ఇస్తున్నారా? కాంగ్రెస్ పాలిస్తున్న ఛత్తీస్‌ఘడ్‌లో ఎంత పెన్షన్లు ఇస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడ్డాక 24 గంటల కరెంటు ఎక్కడ లేని విధంగా ఇంటింటికి మంచినీళ్లు అందిస్తూ ప్రజల కష్టాలను తీర్చాడన్నారు. కల్ల్లిబొల్లి మాటలతోనే కాంగ్రెస్, బిజెపి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా డబల్ బెడ్‌రూమ్‌లను అందజేస్తామన్నారు.

Harish Rao distributes Aasara Pension in Fatehnagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News