Saturday, November 23, 2024

సిద్ధిపేటలో బిసి బంధు చెక్కులను పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు..

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: కులవృత్తులు రోజు రోజుకు అంతరించి పోతున్నాయని, ముఖ్యమంత్రి కెసిఆర్ కులవృత్తు వారిని ఆదుకుంటున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు అన్నారు. జిల్లా మంత్రి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు బుధవారం మంత్రి హరీష్ బిసి బంధు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. “రకరకాల కులవృత్తుల వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు.. ఇబ్బందుల దృష్టిలో పెట్టుకొని వారికి బిఆర్ఎస్ ప్రభుత్వం చేయుత నిస్తుంది. బిసిల కోసం సిఎం కేసీఆర్ బిసి బంధు ప్రవేశ పెట్టారు. రజకులు, నాయి బ్రాహ్మణ వాళ్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాము.

మగ్గం వేసే కార్మికులకు చేనేత మిత్ర కార్యక్రమం ద్వార నెలకు రూ.3000 ఇస్తున్నాము. సిఎం కేసీఆర్ కులవృత్తు వాళ్ళను ఆదుకుంటున్నారు. సిద్దిపేటలో రజకుల కోసం దోబీ ఘాట్ నిర్మాణం చేశాము. కుమ్మరి వాళ్లకు రూ.2కోట్ల 20 లక్షలతో పాత్రలు తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నాము. తెలంగాణ రాకముందు 400ల జూనియర్ కాలేజి ఉంటే, తెలంగాణ వచ్చాక 1300లకు పెంచాము. సిద్దిపేటలో బీసీ రెసిడెన్షియల్ కాలేజి ఏర్పాటు చెయ్యబోతున్నాము” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News