Sunday, December 22, 2024

పార్టీలకు అతీతంగా లబ్దిదారులకు దళిత బంధు..

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: దళితుల జీవితాల్లో నిజమైన వెలుగులు నిండాలనే ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత బంధుకు శ్రీకారం చుట్టారని మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం ఉదయం నియోజకవర్గంలోని కొల్గూరు గ్రామానికి చెందిన 129 మంది లబ్దిదారులకు గజ్వేల్ పట్టణంలో దళిత బంధు పథకం క్రింద మంజూరు పత్రాలు, యూనిట్ లను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  ”డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి రోజున ఆయన కలలు సాకారం కావడం సంతోషంగా ఉంది. ఒక పథకం క్రింద ఒక్కో లబ్దిదారుడికి రూ.10 లక్షలు నగదు బదిలీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ దే. ఇవ్వాల్టి నుంచి దళిత బంధు యూనిట్ ల ద్వారా లబ్దిదారులు సంపాదించుకునే ప్రతి పైసా వారిదే. దళిత బంధును సద్వినియోగం చేసుకోనీ మేము ఏ ఒక్కరికీ తక్కువ కాదని దళితులు నిరూపించాలే. వ్యాపార వృద్ధి సాధించి… అన్ని రంగాలలో ఆదర్శంగా నిలవాలి. పార్టీలకు అతీతంగా లబ్దిదారులకు దళిత బంధు క్రింద యూనిట్ లు మంజూరు చేస్తున్నాం. ప్రతిపక్ష పార్టీల వారికి దళిత బంధు క్రింద ఆర్థిక సహాయం అందజేస్తున్నాం. ప్రజలు న్యాయం, ధర్మం వైపు నిలబడాలే. దళిత, అణగారిన, పేద వర్గాల అభ్యున్నతి కృషి చేసిన మహనీయుడు డా. బాబు జగ్జీవన్ రామ్. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో దేశ ఉప ప్రధాని సహా అనేక ఉన్నత పదవులు చేపట్టి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేశారు. డా. బిఆర్ అంబేద్కర్, డా బాబు జగ్జీవన్ రామ్ కలలను సాకారం చేసేందుకు దళిత బంధు పథకానికి సిఎం శ్రీకారం చుట్టారు. విద్య , ఉద్యోగాలలోనే కాకుండా ప్రభుత్వం ఇచ్చే లైసెన్స్ లు, కాంట్రాక్ట్ లలో సైతం దళితులకు రిజర్వేష న్ కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎస్సీ సబ్ ప్లాన్ కంటే అధిక నిధులు దళితుల అభ్యున్నతి కోసం వెచ్చిస్తున్న రాష్ట్రం తెలంగాణ. దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ చేపడుతున్న పథకాలు, విధాన నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. సిఎం దళిత బంధును ప్రభుత్వ పథకంగా కాకుండా ఉద్యమంలా భావించి అమలు చేస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్ లో దళిత బంధు కోసం 17 వేల 800 కోట్ల రూపాయలు కేటాయించాం. 2 లక్షల మంది లబ్ధిదారులకు పథకాన్ని వర్తింప జేయనున్నాం. ఒక పథకానికి ఇన్ని వేల డబ్బులు కేటాయించడం దేశ చరిత్రలో ఇదే మొదటి సారి” అని తెలిపారు.

Harish Rao distributes Dalit Bandhu Units in Gajwel

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News