Saturday, November 23, 2024

కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దన్నపేట: సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలోని సిద్దన్నపేటలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  తన్నీరు హరీశ్ రావు కళ్యాణ్ లక్ష్మి చెక్కులను పంపించేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పేద తల్లిదండ్రులకు ఆడపిల్లల పెళ్లి భారం కాకూడదని ఒక లక్ష 116 రూపాయల కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ పథకం ద్వారా సహాయం చేకూర్చడం జరుగుతుందన్నారు. డబ్బులు దుర్వినియోగం కాకూడదని ఉద్దేశంతో పెళ్లికూతురు తల్లి పేరు మీద చెక్కు ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. డబ్బులను సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ ఆసుపతృలలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నందున ప్రసూతి సేవల కోసం కచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉపయోగించాలని కోరారు. గర్భం దాల్చిన నాటి నుండి ప్రసవమై ఇంటికి తల్లి, బిడ్డ క్షేమంగా చేరేవరకు ప్రభుత్వం అన్ని స్థాయిలో వైద్య సేవలు అందిస్తూ జాగ్రత్త తీసుకుంటుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవమైతే 12 వేల రూపాయలు కెసిఆర్ కిట్ అందించడం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించబడుతున్నందున డబ్బులను వృధా చేసుకొని ప్రవేట్ ఆసుపత్రులకు వెళ్లొద్దని మంత్రి హరీశ్ రావు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News