Monday, December 23, 2024

హరీశ్ కే జై…

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : రాష్ట్రంలోనే సిద్దిపేటకు ఓ ప్రత్యేకత ఉంది. అది అభివృద్ధి అయినా ఎన్నికల్లో మెజార్టీ అయిన.. కెసిఆర్ నాడు సీఎం హోదాలో ఉన్నారంటే రాజకీయ జన్మనిచ్చింది సిద్దిపేటనే.. హరీష్ రావు సైతం తన రాజకీయ ప్రస్తావాన్ని సిద్దిపేట నుండే మొదలుపెట్టారు. మొట్టమొదటిసారి 2004లో ఎన్నికల్లో గెలిచిన హరీష్ రావు రాష్ట్రంలో తిరుగులేని అగ్రనేతగా నిలిచారు.తెలంగాణ ఉద్యమంలో సైతం బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర మొత్తం పర్యటిస్తూ తనదైన శైలిలో పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు,ఉద్యోగులతో పాటు సబ్బండవర్గాలను ఏకతాటిపైకి తెచ్చింది హరీష్ రావేనని పేరు ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ క్యాబినెట్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేసీఆర్ ఆదేశాలతో దశాబ్దాల కాలం పట్టే కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను మూడు సంవత్సరాల్లోపే పట్టు పట్టి పూర్తి చేయించారు. రాత్రింబవళ్లు ప్రాజెక్టు నిర్మాణ పనుల పై సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ రాకెట్ కంటే ఎక్కువ వేగంలో ప్రాజెక్టు పనులు చేపించడంలో ఆయన పాత్ర కీలకం.

బిఆర్‌ఎస్ రెండవసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటినుండి తనదైన శైలిలో పనిచేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేటర్ స్థాయి ఆసుపత్రులుగా దిద్దడంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లిన హరీష్ రావు పేరు తెలియని వ్యక్తి అసలే ఉండడు. నిత్యం ఏదో సమస్యతో ఆయనను కలవడానికి వచ్చిన ప్రజలను భోజనం పెట్టి వారి సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తారు. ప్రత్యేకంగా ఓఎస్డిలు, పిఏలు ప్రజల సమస్యల పరిష్కారానికి పనిచేస్తారు. అలాగే ఆయన ఫోన్ పై చిన్నపాటి మెసేజ్ పెట్టిన వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేస్తుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే హరీష్ రావు ప్రజల కోసం చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. బిఆర్‌ఎస్ స్థాపించినప్పటి నుండి అధినేత కేసీఆర్ వెంటే ఉంటూ అధినేత ఏ పిలుపునిచ్చిన అ పనిని క్రమశిక్షణ కార్యకర్తల పూర్తి చేస్తారు. నాడు తెలంగాణ ఉద్యమంలో నేడు పార్టీ బాధ్యతలు మోయడంలో కీలక నేతగా ఎదిగారు.

రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా హరీష్ రావు అడుగు పెట్టాడంటే ప్రత్యార్థుల గుండెల్లో గుబులు పుట్టక తప్పదు. విజయం తప్ప ఓటమి ఎరగని నాయకుడు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ అగ్రనేతగా బాధ్యతలు మోస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో మాత్రం ప్రతి ఇంటికో హరీష్ రావు లాగా ఏర్పడి మూకమ్మడిగా ప్రచారాలు నిర్వహించుకుంటున్నారు. నియోజకవర్గం ప్రజలే తన కుటుంబీకులను భావించే హరీష్ రావుకు ప్రజలు వెన్నంటూ ఉంటూ ఈ ఎన్నికల్లో లక్షన్నరకు పై మెజార్టీ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు. సిద్దిపేటలో గత ఆరుసార్లు పోటీచేసిన ప్రజలు ప్రతి ఎన్నికల్లో భారీ మెజార్టీని ఇచ్చి హరీష్ రావును గెలిపించుకున్నారు. సిద్దిపేట అభివృద్ధిలో ఆదర్శంగా ఉన్నప్పటికీ మెజార్టీ ఇవ్వడంలో సైతం ఆదర్శమని రాష్ట్రంలోని అన్ని పార్టీ నాయకులు గుసగుసలాడుకుంటారు. ఈ ఎన్నికల్లో సైతం రాష్ట్రం చూపు సిద్దిపేట వైపు ఉంది. సిద్దిపేట అంటేనే అభివృద్ధికి మారుపేరుగా నిలిపిన ఘనత హరీష్ రావుకు దక్కుతుంది.

కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా ఏ ఒక్కరికి ఆపద వచ్చిన సహాయం అందించడం హరీష్ రావు గొప్పతనం. సిద్దిపేట పేరు తెలియని వారు ఈ రాష్ట్రంలో ఎవరు ఉండరు.. ఇలాంటి గొప్ప స్థాయికి సిద్దిపేట ఎదిగిందంటే అది హరీష్ రావు ప్రత్యేక చొరవనే అని చెప్పుకోవచ్చు. హరీష్ రావు రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న మరెక్కడున్నా ఆయన మనస్సు మాత్రం సిద్దిపేటలోనే ఉంటుంది. ఇతర రాష్ట్రాలకు,విదేశాలకు వెళ్లిన అక్కడ జరిగే అభివృద్ధిని చూసి సిద్దిపేటలో చేపట్టాలన్న పట్టుదల ఆయనలో ఉంటుంది. ఏ రంగంలో చూసిన ప్రజలకు కావాల్సిన వన్నింటినీ దశలవారీగా సిద్దిపేటలో ఏర్పాటు చేశారు.హరీష్ రావు కే తమ మద్దతు అంటూ ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో సిద్దిపేటలో కనీసం డిపాజిట్ అయిన దక్కుతాయా అన్న భయం లో ప్రతిపక్షాలు ఉన్నాయి. ఈ ఏడవ సారి బరిలో నిలిచిన హరీష్ రావుకు లక్ష యాభై వేల మెజారిటీ ఖాయమన్న సాంకేతాలు వెలబడుతున్నాయి. అలాగే నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాసేవకే అంకితమైన హరీష్ రావుకు సిద్దిపేటలో ఏ పార్టీతో పోటీ లేదన్న విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News