Friday, December 20, 2024

ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ నేత క్రిషాంక్ అరెస్టు అప్రజాస్వామికమని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్ రావు తెలిపారు. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?… ప్రజలంతా గమనిస్తున్నారుని మండిపడ్డారు. కాంగ్రెస్, బిజెపి కలిసి చేస్తున్న కక్ష సాధింపులకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్‌ఎస్ తప్పకుండా అత్యధిక సీట్లు గెలుస్తుందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలలో ప్రజలే కాంగ్రెస్ కు బుద్ధి చెబుతారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో మెస్‌ల మూసివేత, సెలవులపై దుష్ప్రచారం చేసిన బిఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్, ఒయు విద్యార్థి నాయకుడు నాగేందర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్తున్న వీరిపై పంతంగి టోల్‌గేట్ వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News