Thursday, January 23, 2025

యువతను బాబు నక్సలైట్ల పేరుతో కాల్చిచంపారు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిడిపి అధినేత, ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు యువతను నక్సలైట్ల పేరుతో కాల్చి చంపారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గురువారం జరిగిన బిఆర్‌ఎస్ ఎల్పి సమావేశంలో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబును ఎపి ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని చురకలంటించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి దుయ్యబట్టారు. చంద్రబాబు ఖమ్మంలో షో చేశారని, తెలంగాణ గురించి… తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని దుయ్యాబట్టారు. వ్యవసాయం దండగా అన్న వ్యక్తి చంద్రబాబు అయితే వ్యవసాయాన్ని పండగలా మార్చిన వ్యక్తి సిఎం కెసిఆర్ అని హరీష్ రావు ప్రశంసించారు. బిజెపి పోత్తు కోసమే చంద్రబాబు డ్రామా చేస్తున్నారని, ఎపిని అప్పుల పాలు చేసి ఇక్కడకు వచ్చారని మంత్రి ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News