హైదరాబాద్: అటవీశాఖ స్పందించకపోవడం వల్లే చెట్లు నరికేశారని, జంతువులు చనిపోయాయని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కంచ గచ్చిబౌలి భూములపై ఆందోళన చేసినా, అటవీశాఖ స్పందించలేదని విమర్శించారు. ఆయన తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వాల్టా చట్టం ప్రకారం చెట్లు కొట్టాలంటే ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలని తెలిపారు. వాల్టా చట్టం ప్రకారం అటవీశాఖ అనుమతి ఇచ్చాకే చెట్లను కొట్టాలన్నారు. వాల్టా ప్రకారం పట్టా భూమిలో చెట్లను కొట్టాలంటే అనుమతి తీసుకోవాలని చెప్పారు.
సుప్రీం కోర్టు నిబంధనలు, తీర్పులను పట్టించుకోకుండా చెట్లను నరికేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కంచ గచ్చిబౌలి భూములు హెచ్ సియూకి చెందినవేనని పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి గతేడాది నవంబర్ 22న రూ.10 వేల కోట్లు రుణం తెచ్చారని, రుణం ఇప్పించిన మధ్యవర్తికి రూ. 170 కోట్లు లంచం ఇచ్చారని తెలియజేశారు. మధ్యవర్తికి ఇచ్చిన డబ్బు గురించి సాక్షాత్తూ అసెంబ్లీలోనే చెప్పారని హరీష్ రావు ఎద్దేవా చేశారు.