Monday, December 23, 2024

గురుకులాల మీద ఏడాదికి రూ.4 వేల కోట్ల ఖర్చు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గురుకులాల విద్యను సిఎం కెసిఆర్ ప్రోత్సహించారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. పిల్లల భవష్యత్ మారితే తెలంగాణ భవిష్యత్ మారుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మెళనానికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. అసోసియేషన్ బిఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. గురుకులాల మీద ప్రభుత్వం ఏడాదికి రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, మంచి పనులు చేసిన సిఎం కెసిఆర్‌ను ప్రజలు ఆశీర్వదించాలని, తెలంగాణకు సిఎం కెసిఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని చెప్పారు. కాంగ్రెస్ నాయకులకు తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియక మేనిఫెస్టో పెడుతున్నారని దుయ్యబట్టారు. అవగాహన లేని మేనిఫెస్టో కాంగ్రెస్‌దని మండిపడ్డారు. కెసిఆర్ చేతిలో తెలంగాణ సుభిక్షంగా ఉందని ప్రశంసించారు. బట్టేబాజ్ చేతిలో తెలంగాణను పెడితే రాష్ట్రం ఆగమైతదని హరీష్ రావు నొక్కి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News