హైదరాబాద్: నిరుద్యోగ యువతి, యువకులకు బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని హరీష్ రావు తెలిపారు. సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ భవన్ నుంచి బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇంకా విడుదల చేయకపోవడంతో నిరుద్యోగ యువత ఆందోళన చెందుతుందన్నారు. ఆరు నెలలైనా జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని, తెలంగాణలో వున్న నిరుద్యోగ యువతి, యువకులకు న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. తెలంగాణలో 67 వేల మంది అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ఉన్నారని, ఐదు నెలల నుంచి సఫాయి కార్మికులకు వేతనాల్లేవని, ఆశా వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రూ.400 పెన్షన్ వెంటనే అమలు చేయాలని, గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. తక్షణమే సిఎంఆర్‌ఎఫ్ సాయం అందజేయాలని,
ఆరు నెలలైంది.. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తారు: హరీష్ రావు
- Advertisement -
- Advertisement -
- Advertisement -