హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి విషయంలో గవర్నర్ తమిళి సై వ్యాఖ్యలు దురదృష్టకరమని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కోఠిలో కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకేలా గవర్నర్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని కానీ బురద జల్లొద్దని హెచ్చరించారు. గవర్నర్‌కు మంచి కనపడదు కానీ చెడును భూతద్దంలో పెట్టి చూస్తున్నారని చురకలంటించారు. గవర్నర్‌లో రాజకీయాలు మాత్రమే కనిపిస్తున్నాయని, వైద్యరంగంలో అభివృద్ధి గవర్నర్‌కు కనిపించడంలేదా? అని మండిపడ్డారు. గవర్నర్ బిజెపి అధికార ప్రతినిధి మాట్లాడటం సరికాదని దుయ్యబట్టారు. చెడు చూస్తాం… చెడు వింటాం…చెడు చెబుతామంటే ఎలా? అని ప్రశ్నించారు. 2015లోనే ఉస్మానియా ఆస్పత్రిని సిఎం కెసిఆర్ సందర్శించారని గుర్తు చేశారు. కొత్త భవనాన్ని నిర్మించాలని కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారని, కానీ కొందరు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని హరీష్ రావు చెప్పారు.
గవర్నర్ వ్యాఖ్యలు దురదృష్టకరం: హరీష్ రావు
- Advertisement -
- Advertisement -
- Advertisement -