మన తెలంగాణ/హైదరాబా ద్: వ్యవసాయరంగంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫసల్ బీమా యోజన పథకం బిజెపి పాలిత గుజరాత్ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని బిజెపి నేతలను రాష్ట్ర ఆర్థ్ధిక , వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. రైతుల గురించి, వ్యవసాయం గురించి బిజెపి నేతలు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లే అని శుక్రవారం ట్విట్టర్‌లో విమర్శించారు. తెలంగాణలో ఫసల్ బీమా అమలు చేయాలని అడుగుతున్న బండి సంజయ్‌పై మంత్రి ఫైర్ అయ్యా రు. ముందు ప్రధాని మో దీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎందుకు అమలు చే యడం లేదో చెప్పగలవా అని ప్రశ్నించారు. దేశంలోని 10 రాష్ట్రాలు, 5 కేం ద్ర పాలిత ప్రాంతాలు ఫసల్ బీమాను వ్యతిరేకిస్తున్నాయని పార్లమెంట్ సాక్షి గా బిజెపి కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారని, దీనిని బట్టే ఆ పథకంతో రైతులకు పెద్దగా ఉపయోగం లే దని అర్థం కావడం లేదా అని నిలదీశారు.
పంట నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ ఎకరాకు రూ. 10 వేలు సాయం చొప్పున, రూ. 228 కోట్లు ప్రకటించి రైతు బిడ్డనని మరోసారి నిరూపించుకున్నారని తెలిపారు. బిజెపి నేతలకు ఇది చిన్న సాయంగా కనిపించడం దురదృష్టకరం అని , దేశంలో ఇంకెక్కడైనా ఇంతకన్నా ఎక్కువ సాయం చేసినట్టు నిరూపించగలరా అని ప్రశ్నించారు. అనునిత్యం రైతులను క్షోభకు గురి చేస్తూ, నల్ల చట్టాలు తెచ్చి రైతులను బలి చేసిన చరిత్ర మీది కాదా అని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని పండుగలా చేసి, రైతును రాజుగా చేసిన ఘనత తమదే అని అన్నారు. సాగు, రైతు సంక్షేమం గురించి బిజెపి నేతలు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.