Monday, December 23, 2024

దయ్యాలు వేదాలు వల్లించినట్టే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్టీలో చేరికల గురించి బిజెపి మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టేనని రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఎంఎల్‌ఎ కాలేరు వెంకటేష్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, దేవి ప్రసాద్, దాసోజు శ్రవణ్, మాజీ ఎంఎల్‌సి శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. వందల కోట్లు ఆశ చూపి టిఆర్‌ఎస్ శాసనసభ్యులను కొనుగోలు చేయాలని ప్రయత్నం చేశారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా బిజెపి ఎత్తుగడలను తమ పార్టీ శాసనసభ్యులు తిప్పికొట్టారన్నారు. మీరు (బిజెపి) విలీనం చేసుకోవచ్చుకానీ…. తాము అదేపని చేస్తే తప్పా? అని హరీశ్‌రావు నిలదీశారు. 8 రాష్ట్రాల్లో దొడ్డిదారిన ప్రభుత్వాలను కూల్చింది నిజం కాదా? అని ఆయన నిలదీశారు. రాజ్యాంగ నిబంధనల మేరకు కాంగ్రెస్ వాళ్లు టిఆర్‌ఎస్‌లో విలీనమయ్యారే తప్ప మీలా ప్రభుత్వాలను కూలగొట్టలేదన్నారు. మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డదారులు తొక్కుతున్నారని హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇడీలను, బోడీలను చూపించి బెదిరింది ప్రలోభాలకు గురి చేసి బిజెపిలో చేర్చుకుంటారు…. ప్రభుత్వాలు పడగొడ్తరని మండిపడ్డారు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీకు (కిషన్‌రెడ్డి) తెలియదా? టిడిపి నుంచి వచ్చిన సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టిజి వెంకటేష్ లను మీరు విలీనం చేసుకున్నరు కదా? అని నిలదీశారు. మరి కాంగ్రెస్ శాసనసభ్యులు టిఆర్‌ఎస్‌లో విలీనం అయితే తప్పేంటి? ప్రశ్నించారు. రఘురామ కృష్ణం రాజుపై వైఎస్‌ఆర్ సిపి ఫిర్యాదుపై ఎందుకు నిర్లయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రెండేళ్ల నుంచి ఎందుకు చర్యలు లేవన్నారు. దమ్ముంటే దీనికి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మొన్న గుజరాత్ లో 8 మంది శాసనసభ్యులు, సిక్కింలో 13 మంది శాసన సభ్యులను బిజెపిలో చేర్చుకోలేదా? అని హరీశ్‌రావు అడిగారు. కర్నాటక, మధ్యప్రదేశ్, గోవా, సిక్కిం.. ఇలా 8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో గద్దెనెక్కిన ప్రభుత్వాలను కూలగొట్టిన మీరు రాజకీయాల కోసం మాట్లాడతారా?మీకు అడిగే నైతిక హక్కు ఉందా? అని హరీశ్‌రావు విమర్శించారు.

Harish Rao fires on BJP in Telangana Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News