Thursday, January 23, 2025

దూబే దుమారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ.86 వే ల కోట్లు కేంద్రం ఇచ్చిందని పార్లమెంట్ వేదిక గా బిజెపి ఎంపి తప్పుడు ప్రకటన చేయడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆగ్ర హం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నిర్మాణంలో ఒ క్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానిది లేద ని, తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకున్న సొంత ని ధులతో ప్రాజెక్టును పూర్తి చేసిందని మంత్రి స్ప ష్టం చేశారు. ఒక్క రూపాయి ఇవ్వకుండా కేం ద్రం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ని ధులు ఇచ్చిందంటూ చెప్పుకోవడం సిగ్గుచేటు అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక్క గుంట తడవలేదు అంటడు, మరొకడు కాళేశ్వరం ప్రాజెక్టు బిఆర్‌ఎస్ ప్రభుత్వంకు ఎటి ఎం అంటడు, కాళేశ్వరంలో అవినీతి జరగలేదని వాళ్లే సర్టిఫికెట్లు ఇస్తరు.

ఇవాళ ఇంకో ఎంపి కా ళేశ్వరం ప్రాజెక్టుకు రూ.86వేల కోట్లు మేమే ఇచ్చామని అంటడు. పాముకు రెండు నాలుకలు అయితే, అబద్దాల బిజెపికి మాత్రం పది నాలుకలు. తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందాలనే నీచమైన ఆలోచన ఆ పార్టీ నాయకులది. సిఎం కెసిఆర్ ఆలోచనతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తే ఓర్చుకోలేక బిజెపి ఎంపిలు ఇలా చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. గతంలో సోషల్ మీడియాలోనే అబద్ధాలు ప్రచారం చేసే ఈ బిజెపి నేతలు ఇప్పుడు పవిత్రమైన పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్‌ను అవమానపరుస్తూ మాట్లాడడం  సిగ్గు చేటు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా అడిగితే ఇవ్వని కేంద్రం, ఇవాళ నిసిగ్గుగా మేమే కట్టాం అనడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. కాగా, దూబేపై గురువారం హక్కుల నోటీసు ఇవ్వాలని బిఆర్‌ఎస్ ఎంపిలు నిర్ణయించారు.
తప్పుదోవ పట్టిస్తున్న బిజెపి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై పార్లమెంటు సాక్షిగా బిజెపి ఎంపిలు పచ్చి అబద్ధ్దాలాడటం సిగ్గు చేటు కాక మరేమిటని బిఆర్‌ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ట్విట్టర్ ద్వారా విరుచుకుపడ్డారు. దేశాన్ని బిజెపి ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం సిఎం కెసిఆర్ ఆలోచన అని పేర్కొంటూ, వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణం మొత్తంతో సదరు ప్రాజెక్టు నిర్మా ణం జరిగింది తప్పితే కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మంజూ రు చేయలేదని స్పష్టం చేశారు. అయితే, భారత ప్రభుత్వం రూ.86,000 కోట్లు మంజూరు చేసిందని బిజెపి ఎంపి నిషికాంత్ దూబె దేశాన్ని తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటుగా అభివర్ణించారు. తెలంగాణ బిజెపి ఎంపిలు కూడా పార్లమెంటులో తప్పుదోవ పట్టించినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బాల్క సుమన్ కేంద్ర ప్రభుత్వాన్ని దగాకోరుగా అభివర్ణించారు.
సొంత నిధులతో కాళేశ్వరం నిర్మాణమన్న మరో కేంద్ర మంత్రి
కాగా, సొంత నిధులతోనే తెలంగాణ కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నారంటూ జులై 22, 2021న ఓ ప్రశ్నకు సమాధానంగా పార్లమెంటు సాక్షిగా జలశక్తి శాఖ మంత్రి ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ ఎంపిలు తెలంగాణ బిజెపి నేతలకు గుర్తు చేస్తున్నారు. ఆ విషయాన్ని విస్మరించి మరలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై బుధవారం పార్లమెంటు సాక్షిగా నిషికాంత్ దూబే అబద్ధాలు చెప్పడంపట్ల బిఆర్‌ఎస్ ఎంపిలు ప్రభుత్వ వైఖరిని తూర్పాబడుతున్నారు. ఇదే విషయంలో తెలంగాణ బిజెపి ఎంపిలు నోరు మెదపని తీరును సైతం వారు గర్హిస్తున్నారు. ఇక దీనిపై సమరమేనంటూ బిఆర్‌ఎస్ ఎంపిలు ప్రతిన బూనుతూ పార్లమెంటులో ఈ అంశంపై ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News