Monday, April 7, 2025

కెసిఆర్‌ లేకపోతే.. తెలంగాణ అనే మాటే లేదు: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ప్రస్తుత సిద్దిపేటీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి ఫైరయ్యారు. ముక్యమంత్రి రేవంత్ రెడ్డి ఏనాడు ఉద్యమంలో పాల్గొనలేదు.. జై తెలగాణ అనలేదు అని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్‌ 9న తెలంగాణ ఏర్పాటు ప్రకటనకు కారణం మాజీ సీఎం కేసీఆరే కారణమన్నారు.

ఎవరో దయతో తెలంగాణ వచ్చినట్లు సీఎం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమం, అమరులను అవమాన పరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకి కాంగ్రెస్‌ పార్టేనే నంబర్‌ వన్‌ విలన్‌ అని దుయ్యబట్టారు. 2001లో కేసీఆర్‌ పార్టీ పెట్టకపోతే తెలంగాణ అనే మాటే లేదని.. తెలంగాణ పదాన్ని ఆనాడు అసెంబ్లీలో నిషేధించారని హరీశ్‌రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News