Thursday, January 30, 2025

రైతుల అప్పులు ముఖ్యమా..? దావోస్ డప్పుల ముఖ్యమా..?:హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు పెట్టుబడుల కట్టు కథను నమ్మించేందుకు శత విధాలా ప్రయత్నించి అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఉందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు విమర్శించారు. సిఎం ప్రెస్ రిలీజులు, మీడియా కవరేజులు, ఈనో స్టోరీలు ఎవరూ నమ్మడం లేదని పేర్కొన్నారు. ప్రెస్ మీట్ పెట్టి, ఎప్పుడో అయిపోయిన దావోస్‌కు ఇప్పుడు ఎందుకు ఈ దావతు అని అడిగారు. దావోస్‌లో జరిగే ఎంఒయులు అన్నీ కూడా ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే అని, ఎవరైనా ఓపెన్ టెండర్‌లో రావాల్సిందే అని ఆర్థిక మంత్రి భట్టి అంటే, సిఎం ఏమో లక్షా 82 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు గప్పాలు చెబుతున్నారని అన్నారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క చెప్పింది నిజమా..?..మీ మాటలు నిజమా..? అంటూ సిఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.

పొంతన లేకుండా సిఎం చెప్పిన కంపెనీలు, పెట్టుబడుల లెక్కలు యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించిందని, అంతా డొల్ల ప్రచారం అని తేలిపోయిందని పేర్కొన్నారు. రైతు భరోసా కోసం గంపెడు ఆశతో, కొండంత ఆందోళనతో ఎదురుచూస్తున్న రైతుల ఆరాటాన్ని చిల్లర పంచాయితీ అంటవా..? అంటూ సిఎంను నిలదీశారు. ఇంతక ముందు రైతుబంధును బిచ్చం అన్నవు, ఇప్పుడు రైతు భరోసాను చిల్లర పంచాయతీ అంటున్నవు..సంక్రాంతికి ఇస్తానన్న సంగతి తేలిపోయింది, చబ్బీస్ (26) జనవరి చేదు మాత్రనే అయ్యింది, ఇప్పుడు మార్చి 31 దాకా గడువు పెంచినవు అని విమర్శించారు. జర్నలిస్టులు ఇదేమని అడిగితే, చిల్లర పంచాయితీ అని సిఎం అంటున్నారని, అప్పుల పాలవుతున్న రైతుల ఆవేదన పక్కన పెట్టీ సిఎం ప్రచారం వినాలా..? అని అడిగారు.

రైతుల అప్పులు ముఖ్యమా..?..దావోస్ డప్పులు ముఖ్యమా..? అని ప్రశ్నించారు. సిఎం సెల్ఫ్ డబ్బాకు,ఆయన వెకిలి సెటైర్లకు కాలం చెల్లిందని, ఇకనైనా కళ్ళు తెరవాలని సిఎం రేవంత్ రెడ్డికి సూచించారు. సిఎంలో అటెన్షన్ డిక్రీసింగ్ డిజార్డర్ మొదలైందని, ఆయన మాటలు ఎవరు నమ్మడం లేదనే ఆందోళన పెరిగిపోయిందని, మంచి మానసిక వైద్యుడిని సంప్రదించడం మంచిదని హరీష్‌రావు సిఎం రేవంత్‌రెడ్డికి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News