Sunday, December 22, 2024

పక్క రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్తారా?: హరీశ్ రావు ఫైర్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిని గాలికొదిలేసి పక్క రాష్ట్రాల్లో ప్రచారం చేసేందుకు వెళ్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లడంపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.

ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ఫైరయ్యారు. “మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు లేవు. మంత్రి సీతక్క సొంత జిల్లాలో పత్తికి మద్దతు ధర లేదు. ఆహార కల్తీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పట్టింపే లేదు. కాంగ్రెస్ చెప్పిన మార్పు ఇదేనా?” అంటూ ప్రశ్నించారు హరీశ్‌రావు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News