Sunday, December 22, 2024

ధోకా, ధోకా, ధోకా… : హరీశ్ రావు ట్వీట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరోసారి హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే ఓ పెద్ద ధోకే బాజ్ పార్టీ అని విమర్శించారు. ధోకా లేకుండా ఉన్న తెలంగాణకు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ధోకా ఇచ్చిందన్నారు.

‘‘ ఎనిమిది నెలల్లో అన్నా ధోకాలు అధ్యక్షా! ప్రతి మహిళకు రూ. 2500 ధోకా, రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ ధోకా, పంటలకు మద్దతు ధరపై రూ. 500 బోనస్ ధోకా, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా ధోకా, ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాల భర్తీ దోకా, 25 వేల పోస్టుల మెగా డిఎస్సీ ధోకా, ప్రభుత్వంలో ఆర్టీసి విలీనం ధోకా, మైనారిటీలకు ప్రత్యేక సబ్-ప్లాన్ ధోకా,తాతలకు రూ. 4వేల పింఛను పెంపు ధోకా, దివ్యాంగులకు రూ. 6వేల పెంపు ధోకా, ప్రతి రోజూ సిఎం ప్రజా దర్భార్ ధోకా, రైతు భరోసా ధోకా, రైతు కూలీలకు రూ 12 వేలు ధోకా’’ అని తీవ్రంగా విమర్శించారు. ఎన్నికలప్పుడు గ్యారంటీల పార్టీ అన్ని నమ్మించి అధికారంలోకి రాగానే గారడీ పార్టీగా మారిందని అన్నారు.

దీనికి సంబంధించిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News