Thursday, January 16, 2025

పథకాలు బంద్‌ పెట్టడమేనా.. మార్పు అంటే: హరీశ్‌ రావు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావు విరుచుకుపడ్డారు. ఉన్న పథకాలు బంద్‌ పెట్టడమే కాంగ్రెస్‌ తెచ్చిన మార్పు అని మండిపడ్డారు. మహిళలకు 2 బతుకమ్మ చీరలు ఇస్తామని రేవంత్‌ మోసం చేశారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కింద 15 వేల రూపాయలు ఇస్తామని.. గుండుసున్నా ఇచ్చారని విమర్శించారు.

కేసీఆర్‌ కిట్‌ కంటే మంచిది ఇస్తామని పేద గర్భిణీలను మోసం చేశారని ఫైరయ్యారు. ఆగస్టులో వేయాల్సిన చేప పిల్లలను అక్టోబరు వచ్చినా వేయలేదని.. చేపపిల్లల కోసం బడ్జెట్లో కేవలం రూ.16 కోట్లే పెట్టారన్నారు.
ముఖ్య నేతల కోసం ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ మార్చారని ఆయన ఆరోపించారు. రీజినల్‌ రింగురోడ్డు దక్షిణ భాగం కేంద్ర ప్రభుత్వం నిర్మించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News