Thursday, January 23, 2025

కొడుకు ఇంటి పన్ను కట్టలేదని తల్లికి వృద్ధాప్యం పింఛన్ కట్

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల జిల్లాలో వృద్ధాప్య పింఛన్ డబ్బులను ఇంటి పన్నులో జమ చేయడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడుకు ఇంటి పన్ను కట్టకుంటే, తల్లికి వచ్చే వృద్దాప్య పింఛన్ ఆపడం అన్యాయం, అమానుషం అని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల తీరు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉందని మండిపడ్డారు. పింఛన్ డబ్బులను కూడా ఇంటి పన్ను కింద జమ చేసుకుంటే, ఆ వృద్ధుల బతుకు బండి నడిచేది ఎట్ల..? అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ప్రతి నెలా రూ.4వేలు పింఛన్ ఇస్తామని చెప్పి,

ఇప్పుడు వచ్చే రూ. 2వేల పింఛన్‌ను గుంజుకోవడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ఒకవైపు లబ్ధిదారుల్లో కోత విధిస్తూ, మరో వైపు చేతికి అందిన పింఛన్‌ను ఇంటి పన్ను బకాయిలో జమ చేయడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా, హాజీపూర్ మండలం, నంనూరు గ్రామ పంచాయతీ పరిధిలో 15 మంది వృద్ధులకు వెంటనే పింఛన్లు చెల్లించాలని అన్నారు. ఇంటిపన్ను, ఇతర కారణాలు చెప్పి పింఛన్లు ఆపకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News